1)అలల ప్రయాణం తీరం వరకే, మెరుపు ప్రయాణం మెరిసే వరకే, మేఘ ప్రయాణం కురిసే వరకే, కలల ప్రయాణం మెలకువ వరకే, ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే, కానీ స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు గతమన్నది గతమేనురా.... వ్యధచెందకు విలపించకు... విధి ఆటలొ కష్టాలకు..... కడ యేదిర దుఖ్ఖించకు... తలరాతనె ఎదిరించరా... చిరునవ్వుతొ చిరునవ్వుతొ.. మున్ముందుకే అడుగెయ్యరా... చిరునవ్వుతొ చిరునవ్వుతొ... కిరణానికి చీకటి లేదు......... సిరిమువ్వకి మౌనం లేదు........... చిరునవ్వుకి మరణంలేదు..... మన స్నేహనికి అంతంలేదు..... మరిచే స్నేహం చెయ్యకు......... చేసే స్నేహం మరవకు ఇట్లు నాని 2) ప్రియ నేస్తం.... ప్రపంచం అంతా దూరం అయినా... నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేవాడే “స్నేహితుడు...ఆ స్ధానంలో నాకు “నాకు నువ్వు” “నీకు నేను” ఒకరి కొకరు.. ఈ స్నేహమే మన ప్రపంచం “నువ్వు అనే ఈ రెండక్షరాలే నా చేయి పట్టి నడిపిస్తుంటే...నువ్వు అనే ఈ రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే...నువ్వు అనే ఈ రెండక్షరాలే నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే.....ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో... నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....నీ స్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే ........... నాకు నువ్వు వున్నావనే భావన.....మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే, నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని.....ఈ ప్రపంచానికంతా వినపడేలా అరిచి చెప్పాలని వుంది..... “ఇదిగో నా ప్రియ నేస్తం అని
3)హేమంతపు ఉదయంవేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలుదోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులుఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దుఆవిష్కరించే అందమైన చిత్రాలుమరోపక్క మాయచేసే మంచు తెరల మధ్యచలిమంటల వెచ్చదనాలుముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళుమనసునిండుగా హరిదాసు దీవెనలుఎంత పొద్దెక్కినాసూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలోచలిగిలికి ఇంకావిచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలోఏ ఏకాంతక్షణంలోనోనన్నడగకుండా వచ్చేసిపారిజాతాల తోటలోని నేస్తాలదగ్గరకి తీసుకుపోతాయిఒక్కోసారి సమూహం నుండి వేరుచేస్తూనన్నునాకు దగ్గర చేస్తాయిచిరునవ్వులు పూయిస్తాయిచెమరింతలు తెప్పిస్తాయికారణాలు వెతికిస్తాయికాలక్షేపం చేయిస్తాయిమరుక్షణంలోనే నేనేమీకానట్టువదిలేసి వెళ్ళిపోతాయినావని గర్వం గా చెప్పుకున్నవిఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,ఉద్వేగపు క్షణాలు...అన్నీనాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకునిఅలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నానుఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీఒక్కసారిగా చెరిగిపోయాయినమ్మకాలన్నీ భ్
4)అందమైన నీ రూపాన్ని చెక్కడానికి ఆ బ్రహ్మా ఎంత కష్టపద్దదోకని నీ అందాన్ని కోరుకొమ్మని అడగటానికి నా కనులకు ఎంత కష్టమనిపించిందో కానీ నా మనసు మాత్రం కోరుకునేది నిన్నే ...........నీ కోసమే జీవిస్తా ........నీ కోసమే మరణిస్తా .......ఎప్పటికైనా ప్రేమిస్తా ............కాదంటే సాసిస్తా ...................లేదంటే వేరే అమ్మాయిని అసిస్తా ......... 5)వేదాలు తెలుపని సత్యం, శాస్రాలు పలుకని ఆచారంకాలాలు చూడని కావ్యం, గ్రహాలు తిరగని గమనంపండితులు చదవని శాస్రాం, కవులు వ్రాయని గ్రంధంమన స్నేహంకన్నులు తెలిపె సత్యం, మనసులు పలికె ఆచారంభావలు రాసే కావ్యం, మోనాలు రాసే గ్రంధంమాటలు చెసే యుద్దంఅదె మన స్నేహంనీ స్నెహం ఇకరాను ఇది కరిగే కలగా అయినాఈ దూరం నువురాకు అని నను వెలివెస్తు ఉన్నామనసంతా నువ్వే నా మనసంతా నువ్వేఆనందం చెప్పా లేనిది....,సంతోషం పట్టరానిది......,కోపం పనికిరానిది.......,ప్రేమ చెరిగిపోనిది.......,కాని...స్నేహం మరువలేనిది
ఐనా కెలకమనగానే కెలికేడిమేనేటి....సర్లే మన గురించి మనం గొప్పగా సెప్పుకుంటే ఏం బొంటది సెప్పండి ... బాల్యం:-సిన్నప్పున్నుండి ఆటల్లోనూ , యవన్నన్న కెలకడం లోను పోస్టు...
ఇక మనం పుట్టగానే పంతులుగోడు అబ్బో ఈడు సేలా గోప్పోడవుతాడన్నాడట ...
నేను పెరిగి పెద్దైన తరవాత దగ్గర్నుండి మా బాబు ఆ పంతులుగాడి కోసం కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు ... ఆడు పరారిలో వున్నాడ్లెండి..
విద్యాభ్యాసం:-ఇక సదువు గురించంటారా........
అబ్బో.... తెగ సదివేసామండి బాబు... ఎగ్జాం పేపరు వొచ్చిందంటే చాలు మేష్టరు కళ్లు మూసుకుని నూటికి తొంభైకి తొంభై .....
తక్కువేసి పంపెసేవోడు....అయినా మనo సిన్నప్పున్నుండి క్లాసు పోస్టు లెండి లాస్టు నుండి ... బెంచీ కూడా..
''చిరిగిన సెకండ్ హేండ్ పుస్తకమైనా కొనుక్కో మిగలిన డబ్బులతో కొత్త సినిమా టిక్కెట్టు కొనుక్కో '' అని పెద్దలు చెప్పిన సిద్ధాంతాన్ని తు.చ తప్పకుండా పాటించినోడిని..
నాకు సిన్నప్పున్నుండి సమాజ సేవ సేయ్యాలనుండేది... సెయ్యలెకపొయెవొన్ని.. ... అది డిగ్రీ కొచ్చాక తీరింది... మా కాలేజి వున్న వూర్లో ఒక థియేటర్ వుండేది .. ఆయనకీ పాపం ఒక పెళ్లి కాని కూతురుండేది... ఆ అమ్మాయి పెళ్ళికి సాయం సేయ్యడానికి నా కెరీర్ నాశనమవుతుందని తెలిసి కూడా ఆ థియేటర్లో మూడు సంవత్సరాలు సినిమాలు చూసాను...ఫలితం..
డిగ్రీ అయిదు సంవత్సరాలు... అలా కష్టపడి అయిదేళ్ళలో డిగ్రీ పూర్తీ చేసి బయటపడ్డాను...డ్రెస్సు తక్కువేసే హీరోయిన్కే పుకార్లేక్కువన్నట్టు నన్ను కూడా నా ఫ్రెండ్సు , లేక్చరర్సు , సరిగ్గా కాలేజీకి రావట్లేదని ఆడిపోసుకున్నా.. నేను మాత్రం కాలేజి కెళ్ళకుండా నేను చేసిన త్యాగాన్ని ఎవరికీ చెప్పకుండా కష్టాల్ని గుండెలోనే దాచుకున్నాను..
నాలుక దూల కారణంగా ఒకసారి సస్పెండ్ కూడా అయ్యా.. ప్రాక్టికల్ లో మార్కులు కూడా దొబ్బెట్టుకున్నాలెండి...
ఈ విదంగా నా డిగ్రీ.. పూర్తయ్యింది...పాత సినిమాలోలా కష్టపడేవాల్లకేప్పుడూ న్యాయo జరగనట్టుగానే నాకూ అన్యాయమే జరిగింది.. ఐదేళ్లు కస్టపడి సదివిన నాకంటే... జస్ట్ మూడేళ్లు సదివినోల్లకే వుజ్జోగాల్లిఛ్చేరు... ఇక లోకంలో సామాజిక న్యాయమెక్కడుందండి...?
ఇప్పుడొక సిన్న (((BREAK)))
=======================
(( ఉంగే.. ))
((( ఉంగే... ఉంగే...)))
((( (( ఉంగే.... ఉంగే... )) )))
ఎ..మి..టీ.. సంగతీ.....
పాప యెడ్చింది....
ఎ..డు..స్తుందా... దొంగముండ ... బాలక్రిశ్న సినిమా చూపిస్తానని బయపెట్టు...
సిన్నప్పుడు నిన్నూ అలాగే బయపెట్టే దాన్ని.......
కొరస్:- తరాలు మారిన తరగని భయం బాలయ్యా...
((( బాలయ్యా.. )))
((( (( బాలయ్యా )) )))
========================మన లవ్ స్టోరి :-నేను డిగ్రీ 1st year చదువుతుండగా ఆమెను మొట్టమొదటిసారి చూసాను...ఆమె తర్వాత మా కాలేజ్ లోనే డిగ్రీ జాయినయ్యింది...
అప్పుడు నేను 2nd ఇయర్ ...
ఆమె 1st ఇయర్ చదువుతున్నప్పుడు ఒకసారి నన్ను చూసి నవ్వింది...
అంతే... మన లైఫ్ టైము టేబుల్ మారిపొయింది... వెయ్యని కోతి వేషం లేదు... ఎప్పుడూ ఆమెనే కలలో...
కల్లో వస్తుంది కదాని పగలు కూడా పడుకోడం మొదలెట్టా....
పిచ్చి బురకేక్కింది.. చదువు అటకెక్కింది..
ఆమె 3rd ఇయర్ కొచ్చింది....మన డిగ్రీ నాలుగో సంవత్సరానికొచ్చింది.....
అలా ఐదేళ్ళలో నా డిగ్రీ పూర్తయ్యింది .... ఆమెకు పెళ్ళయ్యింది..
తెలుసుకున్న నీతీ:-" అబ్బాయిల మనసు పిడకలాంటిది.... అమ్మాయిల మనసు పొయ్యి లాంటిది...
పిడకేల్లి పొయ్యిలో పడ్డా... పోయ్యోచ్చి పిడక మీద పడ్డా... కాలి బూడిదయ్యేది పిడకే"...
కష్టాలు:-
ఎన్నో కష్టాలు పడ్డాను... తినడానికి అన్నం దొరక్క బిర్యాని తినాల్సోచ్చేది... తాగడానికి పచ్చి మంచి నీళ్ళు దొరక్క... ఎప్పుడో నెల కిందట తయారుచేసిన కూల్ డ్రింక్స్ తాగాల్సొచ్చేది..... ఒక్కోసారి తిన్నదరక్క పస్తులుoడాల్సోచ్చేది.....
అయినా ఆ కష్టాలు తలచుకున్నప్పుడు కొంచెం భాదగానే వుంటాది...
అయినా నాలాంటి అమాయకుల్ని ఈ లోకం ఎడిపిస్తూనే వుంటాది...
అయినా సరే... చిరంజీవి, నేను, రజనీకాంత్ .... మాలాంటి లేజెండులకి ఈ కస్టాలు స్టాటింగు లో కొన్నాళ్ళు తప్పవు లెండి ఎంసేత్తాం....
నా కష్టాలు మీక్కొంచెం బాధగా వుండొచ్చు... అయినా మీరు బాధ పడొద్దు ...
మీ వంతు సాయంగా... ఆ దేవుణ్ణి నాకేదో సిన్న R.T.A ఆఫీసర్గా వుజ్జోగం రావాలని కోరుకోండి చాలు...
యేదొ ఈ జీవితాన్ని ఏదో మూడు బళ్ళు ఆరు వేలుగా గడిపెస్తా...
కెలికింది చాలుగానీ... కిందన VIEW FULL PROFILE నొక్కు..
మనకు ఎందరో పరిచయం అవుతుంటారుఅందులో కొందరే మంచి స్నేహితులవుతారుమనతో మంచి చెడు పంచుకుంటూమంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా
1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"...
2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...
3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...
4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End..'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...
5."నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట"...
6."ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి"...
7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు....!
Friday, November 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment